టర్కీలో ఉగ్రవాదదాడి | Four Turkish policemen wounded in suicide bombing | Sakshi
Sakshi News home page

టర్కీలో ఉగ్రవాదదాడి

Nov 15 2015 2:44 PM | Updated on Nov 6 2018 7:56 PM

టర్కీలో ఉగ్రవాదదాడి - Sakshi

టర్కీలో ఉగ్రవాదదాడి

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు.

అంకారా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. టర్కీలో జీ 20 సమావేశాలు జరుగుతున్నసమయంలో  ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు.  ఈ దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

జీ 20 సమావేశాల సందర్భంగా హైఎలర్ట్  ప్రకటించిన నేపథ్యంలో రక్షణ దళాలు ఘజియాంటెప్ ప్రావిన్స్ లోని ఒక ఇంటిపై సోదాలు జరుపుతున్న సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు.  గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు చెలరేగారు.  భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు దేశాధినేతలు జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీలోనే ఉన్నారు.

గత అక్టోబర్ లో  టర్కీ రాజధాని  అంకారాలో ఉగ్రవాదులు  ఆత్మాహుతి  దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో100  మందికి పైగా   చనిపోయాగా, వందల  సంఖ్యలో గాయపడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement