కూలిన విమానం : నలుగురి మృతి | Four Killed In Plane Crash At Southern California Airport | Sakshi
Sakshi News home page

కూలిన విమానం : నలుగురి మృతి

Jan 23 2020 9:18 AM | Updated on Jan 23 2020 9:58 AM

Four Killed In Plane Crash At Southern California Airport - Sakshi

కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్‌లో విమానం కుప్పకూలడంతో నలుగురు మరణించారు.

న్యూయార్క్‌ : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా కరోనా మున్సిపల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కరోనా ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఉదయం చిన్నపాటి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అవుతుండగా, విమానం గాలిలో ప్రయాణించలేకపోయింది. ఆ తర్వాత విమానం ఫెన్స్‌ను తాకుతూ కుప్పకూలి విమానాశ్రయానికి తూర్పున ఉన్న బారికేడ్‌ను తాకింది. 80 గ్యాలన్ల ఇంధనాన్ని మోస్తున్న విమానం, ఆపై పల్టీలు కొట్టి మంటల్లో చిక్కుకుంది తర్వాత మంటలు చెలరేగాయి.


పైలట్‌కు విమానంపై కంట్రోల్‌ తప్పిందని రన్‌వేపై చాలా వేగంగా విమానం పరిగెత్తిందని ప్రమాద ఘటనను వీక్షించిన మరో పైలట్‌ దొర్తీ వోల్‌ చెప్పారు. ఇంధన ట్యాంకుల నుంచి పేలుడు శబ్ధం వినిపించగా విమానంలో మంటలు వ్యాపించాయని ప్రయాణీకులు పరిగెత్తుతూ కనిపించారని తెలిపారు. విమానం గంటకు 90 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుండవచ్చని మరో పైలట్‌ వాట్‌ సిండర్‌ అంచనా వేశారు. కాగా విమాన మోడల్‌తో పాటు ప్రమాదానికి ప్రధాన కారణం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంతో విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు విచారణకు ఆదేశించాయని వెల్లడించారు.

చదవండి : 176 మంది మృతి: ‘నా తండ్రి సజీవంగా ఉన్నారు’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement