మా వాడు వాళ్లను చంపాల్సింది కాదు

మా వాడు వాళ్లను చంపాల్సింది కాదు


వాషింగ్టన్: ఫ్లోరిడాలోని గే క్లబ్లో నరమేధం సృష్టించి 50 మందిని కిరాతకంగా చంపిన ఒమర్ మతీన్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు కాదని అతని తండ్రి సిద్ధిఖీ మతీన్ చెప్పాడు. తన కొడుకు నైట్ క్లబ్పై దాడి చేసి ఉండాల్సికాదని చెబుతూనే.. స్వలింగ సంపర్కులను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించాడు. సిద్ధిఖీ ఇచ్చిన ఇంటర్వ్యూను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.  ఆదివారం ఆర్లెండోలోని నైట్ క్లబ్లో అఫ్ఘానిస్తాన్ సంతతికి చెందిన ఉన్మాది ఒమర్ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. గే సమాజంపై అసహ్యంతోనే తన కొడుకు దాడికి పాల్పడి ఉండొచ్చని సిద్ధిఖీ చెప్పాడు. ఈ ఘటన జరగడానికి 12 గంటల ముందు తన కొడుకు ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అతను సాధారణంగా కనిపించాడని తెలిపాడు. ఒమన్ అసహనంగా, కోపంగా ఉన్నట్టు అనిపించలేదని చెప్పాడు. నైట్ క్లబ్లో తన కొడుకు కాల్పులు జరిపాడని తెలియగానే షాక్కు గురయ్యాయనని పేర్కొన్నాడు. ఈ ఘటన చాలా బాధాకరమంటూ, అమెరికా ప్రజలకు సానుభూతి తెలిపాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top