భలే ఐడియా.. ఈ నాన్నకు హ్యాట్సాఫ్‌!!

Father Gives Toddler Fake Roller Coaster Ride Wins Netizens Hearts - Sakshi

ప్రతీ తల్లిదండ్రులకు తమ పిల్లల సంతోషమే మొదటి ప్రాధాన్యం. అందుకోసం ఎంతటి కష్టాన్ని ఓర్చుకోవడానికైనా వారు సిద్ధపడతారు. అంతేకాదు పిల్లల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం పక్కనపెట్టేస్తారు. ఇక తమ చిట్టిపాపాయిలు.. ముఖ్యంగా కూతుళ్ల చిరునవ్వు కోసం వినూత్న ఆలోచనలు చేసే తండ్రులు కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. నెటిజన్ల చేత ఉత్తమ తండ్రి అంటూ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే... నికోలే అనే పాపాయి తండ్రి తన చిన్నారి కూతురికి రోలర్‌ కోస్టర్‌లో తిరిగిన అనుభూతి కలిగించాలనుకున్నాడు. అంత చిన్న పాపతో అటువంటి సాహసం ప్రమాదకరం కాబట్టి.. ఇంట్లోనే ఆ ఏర్పాటు చేశాడు. 

నికోలేను వాకర్‌లో కూర్చోబెట్టి... టీవీ స్క్రీన్‌పై రోలర్‌ కోస్టర్‌ వీడియో ప్లే చేస్తూ దానికి దగ్గరగా కూతుర్ని తీసుకువెళ్లాడు. దీంతో టీవీ చూస్తూ.. నిజంగానే తాను రోలర్‌ కోస్టర్‌లో విహరిస్తున్నట్లుగా ఆ చిన్నారి కేరింతలు కొడుతూ ఉంటే అతడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను...ఓ ట్విటర్‌ యూజర్‌ ‘‘ రోలర్‌ కోస్టర్‌ ఎక్కేంత పెద్దవాళ్లు కానపుడు ఇలా చేయండి’’ అని క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ క్రమంలో.. ‘‘భలే ఐడియా.. ఈ నాన్నకు హ్యాట్సాఫ్‌.. ప్రతీ కూతురు తన తండ్రికి యువరాణే అని మరోసారి నిరూపించాడు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top