ట్రంప్‌ రాజీనామా! | Fake Washington Post handed out in US falsely reports Trump’s resignation | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ రాజీనామా!

Jan 18 2019 2:29 AM | Updated on Apr 4 2019 4:25 PM

Fake Washington Post handed out in US falsely reports Trump’s resignation - Sakshi

ట్రంప్‌ రాజీనామా అంటూ నకిలీవార్తను ప్రచురించిన పేపర్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని వాషింగ్టన్‌ ప్రజలు బుధవారం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజీనామా చేశారని ’వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ’అన్‌ప్రెసిడెంటెడ్‌‘ అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్‌ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది. 2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రికను కొందరు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్‌ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. ఈ తేదీని గమనించిన వ్యక్తులు ఇది నకిలీ ఎడిషన్‌ అని భావించారు.

చివరికి ఈ విషయం వైరల్‌గా మారడంతో వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక స్పందిస్తూ.. అది నకిలీ ఎడిషన్‌ అనీ, దానితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ట్రంప్‌ 2019, ఏప్రిల్‌ 30న వైట్‌హౌస్‌ను వదిలివెళ్లిపోయినట్లు ఈ నకిలీ ఎడిషన్‌లో లీసా చుంగ్‌ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘ రాజీనామా విషయంలో ట్రంప్‌ అధికారిక ప్రకటనను వెలువరించలేదు. 2019, ఏప్రిల్‌ 30న ఓవల్‌ కార్యాలయంలోని అధ్యక్షుడి డెస్క్‌ పక్కన ఓ న్యాప్‌కిన్‌ దొరికినట్లు నలుగురు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు.

అందులో ఎరుపురంగు ఇంక్‌తో ‘ఇందుకు(తన రాజీనామాకు) నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్‌ను, హైఫియర్‌ను, నకిలీ వార్తల మీడియాను నిందించండి’ అని ట్రంప్‌ రాసినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన శ్వేతసౌధం వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్ట్‌కు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అమెరికా అధ్యక్షుడిగా వెంటనే ప్రమాణస్వీకారం చేశారు’ అని కథనం ప్రచురితమైంది. ట్రంప్‌ రాజీనామాతో దేశవిదేశాల్లో సంబరాలు చేసుకున్నారని ఎడిషన్‌లో  వార్త వచ్చింది.  నకిలీ ఎడిషన్‌తో తమకు సంబంధంలేదని వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రకటించింది. ‘యస్‌ మెన్‌’ అనే గ్రూపు నకిలీ పత్రిక, వెబ్‌సైట్‌ను నడుపుతోందని  అమెరికా జర్నలిస్ట్‌ రామ్సే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement