ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్ | El Salvador President seren | Sakshi
Sakshi News home page

ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్

Mar 18 2014 2:20 AM | Updated on Sep 2 2017 4:49 AM

ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్

ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్

ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు.

శాన్ సాల్వెడార్: ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో సాంచెజ్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

అయితే ఈ ఫలితాలను ఆయన ప్రత్యర్థి, ఏరెనా పార్టీకి చెందిన నోర్మన్ క్యుజానో సవాలు చేయడంతో పాక్షికంగా రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతరం సాంచెజ్ విజయం సాధించినట్టుగా సుప్రీం ఎలక్టోరల్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు యుజెనియో చికాస్ ప్రకటించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అందువల్ల పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ జరపాలని నోర్మన్ చేసిన డిమాండ్‌ను చికాస్ తిరస్కరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement