కోర్టు హాల్లో మోర్సీ మృతి

Egypt's ex-President Mohamed Morsi dies after court appearance - Sakshi

కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్‌ మోర్సీ (67) కోర్టు హాల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ సోమవారం కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి తరలించినట్లు టీవీ తెలిపింది. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్‌ పదవీచ్యుతుడైన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఈజిప్టులోని అతిపెద్ద ఇస్లామిస్టు గ్రూపు, ప్రస్తుతం నిషేధానికి గురైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top