breaking news
Mohamed Morsi
-
కోర్టు హాల్లో మోర్సీ మృతి
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (67) కోర్టు హాల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ సోమవారం కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి తరలించినట్లు టీవీ తెలిపింది. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఈజిప్టులోని అతిపెద్ద ఇస్లామిస్టు గ్రూపు, ప్రస్తుతం నిషేధానికి గురైన ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఈజిప్టు ఘర్షణల్లో ఒకరు మృతి
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి మద్దతుదారులు, వ్యతిరేకులకు మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని ఆ దేశ ఆర్యోగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫతల్లాహ్ బుధవారం వెల్లడించారు. కొంతమంది ఆందోళనకారులు ఇస్లామిస్ట్ల వ్యాపార సంస్థలపై రాళ్లు రువ్వారని తెలిపారు. అలాగే మోర్సీ మద్దతుదారులు మంగళవారం ఉదయం ఈజిప్టు రాజధాని కైరోలోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడు చేసి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోర్సీ మద్దతుదారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయాలపాలైయ్యారని తెలిపారు. గత నెల 3వ తేదీన ఈజిప్టు అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన మోర్సీను తిరిగి అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టాలని ఆయన మద్దతుదారులకు చెందిన పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3 నుంచి మోర్సీ మద్దతుదారులకు, వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.