ఈజిప్టు ఘర్షణల్లో ఒకరు మృతి | One killed in Egypt clashes | Sakshi
Sakshi News home page

ఈజిప్టు ఘర్షణల్లో ఒకరు మృతి

Aug 14 2013 10:43 AM | Updated on Jul 11 2019 6:15 PM

ఈజిప్టులో జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని ఆ దేశ ఆర్యోగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫతల్లాహ్ బుధవారం వెల్లడించారు.

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి మద్దతుదారులు, వ్యతిరేకులకు మధ్య మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని ఆ దేశ ఆర్యోగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫతల్లాహ్ బుధవారం వెల్లడించారు. కొంతమంది ఆందోళనకారులు ఇస్లామిస్ట్ల వ్యాపార సంస్థలపై రాళ్లు రువ్వారని తెలిపారు. అలాగే  మోర్సీ మద్దతుదారులు మంగళవారం ఉదయం ఈజిప్టు రాజధాని కైరోలోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడు చేసి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా మోర్సీ మద్దతుదారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు గాయాలపాలైయ్యారని తెలిపారు. గత నెల 3వ తేదీన ఈజిప్టు అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన మోర్సీను తిరిగి అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టాలని ఆయన మద్దతుదారులకు చెందిన పలు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3 నుంచి మోర్సీ మద్దతుదారులకు, వ్యతిరేకులకు మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement