
ఇంకీ పింకీ జాంకీ..
వీటిల్లో ఒకటి జీబ్రా.. రెండోది? ఏదో తేడాగా ఉంది కదూ.. గాడిదలా కనిపిస్తోందా.. అయితే, ఇది డాంకీ కాదు.. జాంకీ! అవును.. ఎందుకంటే.. దీని తండ్రి గాడిద.. తల్లి జీబ్రా(ఫొటోలోనిది). అందుకే దీన్ని జాంకీ అంటున్నారు.
వీటిల్లో ఒకటి జీబ్రా.. రెండోది? ఏదో తేడాగా ఉంది కదూ.. గాడిదలా కనిపిస్తోందా.. అయితే, ఇది డాంకీ కాదు.. జాంకీ! అవును.. ఎందుకంటే.. దీని తండ్రి గాడిద.. తల్లి జీబ్రా(ఫొటోలోనిది). అందుకే దీన్ని జాంకీ అంటున్నారు. అసలు పేరు కుంభ. ఓ వారం క్రితం మెక్సికోలోని రేనొసా జూలో పుట్టింది. జాంకీ పుట్టుక వెనుక చిన్న లవ్ స్టోరీ ఉంది. జాంకీ తల్లిదండ్రులు ఫస్ట్ ఫ్రెండ్స్ అట. రోజూ మధ్యాహ్నం కలుసుకునేవారట.. అలాఅలా లవ్ పుట్టి లవర్స్ అయిపోయాయట. అంతేకాదు.. జాంకీ చాలా అరుదైనదట. ఎందుకంటే.. గాడిద, జీబ్రా క్రోమోజోములు పూర్తిగా విరుద్ధమైనవని.. జాంకీ పుట్టడం అరుదైన పరిణామమని జూ అధికారులు చెబుతున్నారు.