విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్‌ | Sakshi
Sakshi News home page

విదేశాంగ మంత్రికి షాకిచ్చిన ట్రంప్‌

Published Tue, Mar 13 2018 8:01 PM

Donald Trump Ousts Rex Tillerson - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో మైక్‌ పాంపీని నియమించిస్తున్నుట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఉత్తర కొరియాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని వైట్‌హౌజ్‌ ప్రతినిధులు మంగళవారం తెలియజేశారు. ఇందులో భాగంగానే సెంట్రల్‌ ఇంటిలెజెన్స్‌ ఏజెన్సి(సీఐఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మైక్‌ పాంపీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ పదవికి మైక్‌ మాత్రమే అర్హులు: ట్రంప్‌
గత శుక్రవారమే రెక్స్‌ టిల్లర్‌సన్‌ను పదవి నుంచి వైదొలగాలని హెచ్చరించిన ట్రంప్‌ అన్నంతపని చేశారు. సీఐఏ డైరెక్టర్‌గా అపార అనుభమున్న మైక్‌ పాంపీని విదేశాంగ మంత్రి పదవి ఎంపిక చేసినందుకు గర్వపడుతున్నానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. హార్వర్డ్‌ లా స్కూల్‌లో ఆనర్స్‌ పట్టా పొంది, యూఎస్‌ ఆర్మీలో పనిచేసిన గొప్ప వ్యక్తి మైక్‌ అని కొనియాడారు.

ఆయన స్థానంలో గినా హాస్పెల్‌...!
సీఐఏ డైరెక్టర్‌ పదవికి ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌ను నామినేట్‌ చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇదేగనక నిజమైతే అమెరికా చరిత్రలో గూఢాచార సంస్థకు డైరెక్టర్‌గా ఎన్నికైన తొలి మహిళగా గినా హాస్పెల్‌ చరిత్ర సృష్టించనున్నారు. ‘ముప్పై ఏళ్ల సర్వీసున్న తనకు త్వరలోనే ప్రమోషన్‌ రాబోతుందని, అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని గినా హాస్పెల్‌ అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Advertisement