భారతీయ కరెన్సీని చట్టబద్ధం చేయండి

Declare Banned currency legal, Nepal Writes To RBI - Sakshi

కఠ్మాండ్‌: నోట్ల రద్దు అనంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను నేపాల్‌లో చట్టబద్ధం చేయాలని కోరుతూ ఆ దేశ ప్రభుత్వం భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ)కి లేఖ రాసింది. దేశంలో ప్రసుత్తం చలామణి అవుతున్న రూ. 200, రూ. 500, రూ. 2,000 కొత్త నోట్లకు సంబంధించిన బ్యాంకు బిల్లులకు చట్టబద్ధత కల్పించాలని కోరింది. ఈ మేరకు నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు (ఎన్‌ఆర్బీ) శుక్రవారం ఆర్‌బీఐకు లేఖ రాసినట్లు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది.

నేపాలీల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పించాలని కూడా లేఖలో విజ్ఞప్తి చేసింది. నోట్ల రద్దు అనంతరం నేపాల్‌లో రూ. 100, అంతకంటే తక్కువ విలువున్న నోట్ల చలామణికి మాత్రమే ఆర్‌బీఐ అనుమతిచ్చింది. భారత్‌ ప్రవేశపెట్టిన కొత్త నోట్లకు నేపాల్‌లో చట్టబద్ధత కల్పించకపోవడంతో పెద్ద నోట్లను రద్దు చేయాలని ఇటీవల నిర్ణయించినట్లు ఎన్‌ఆర్బీ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై పలు రంగాల ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెనక్కుతగ్గామని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top