చనిపోయినా ఎన్నికల్లో గెలిచాడు

Dead brothel Owner Dennis Hof Wins Election for Nevada Legislative Seat - Sakshi

లాస్‌వేగాస్‌ : అమెరికాలోని నెవడాలో జరిగిన ఎన్నికల్లో గత నెల మరణించిన ఓ వ్యక్తి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 36వ అసెంబ్లీ డిస్ట్రిక్‌ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేసిన వేశ్య గృహాల యజమాని, టీవీ రియాలిటీ షో స్టార్‌ డెన్నిస్‌ హోప్‌ (72) విజయం సాధించాడు. అయితే హోప్‌ గత నెల 16నే  మరణించాడు. చనిపోయిన కొద్ది రోజుల ముందే ఆయన 72వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. హోప్‌ మరణించినా ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి లెసియా రామనోవ్‌పై భారీ ఆధిక్యం లభించింది. నెవడా చట్ట ప్రకారం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి మరణించినా ఓటింగ్‌ జరుగుతుంది. ఒక వేళ చనిపోయిన వ్యక్తి గెలిస్తే .. ఆ పార్టీకి చెందిన మరో వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. దీంతో అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని కౌంటీ అధికారులు రిపబ్లికన్‌ పార్టీకి సూచించారు. 

కేవలం ఈ రాష్ట్రంలోనే వ్యభిచారానికి అధికారికంగా అనుమతుండగా.. హోప్‌ 5 వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడు. హెచ్‌బీవో ఛానెల్‌ అడల్ట్‌ కంటెంట్ క్యాథ్‌హౌస్‌ సిరీస్‌లో కూడా హోప్‌ నటించాడు. ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ ది పింప్‌’ , ది ఆర్ట్‌ ఆఫ్‌ ది డీల్‌’ పేరుతో పుస్తకాలు రాశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top