మళ్లీ జిన్‌పింగ్‌కే చైనా పగ్గాలు!

current president of Dragon Country China is the re-elected of Zee Jinping.

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనా ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తిరిగి ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఐదేళ్లకోసారి జరిగే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) కాంగ్రెస్‌లో వరుసగా రెండోసారి జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ఈనెల 18 నుంచి బీజింగ్‌లో 19వ సీపీసీ కాంగ్రెస్‌ సమావేశాలు జరగనున్నాయి. తదుపరి ఐదేళ్లకు దేశ నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఈ భేటీలో ప్రధాన ఎజెండా. ఈ మేరకు జిన్‌పింగ్‌ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన కమ్యూనిస్టు పార్టీ.. తిరిగి ఆయన్నే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోంది. ఐదేళ్ల కిందట ఇదే సమయంలో జరిగిన 18వ సీపీసీ కాంగ్రెస్‌లో అప్పటి అధ్యక్షుడు హు జింటావో, ప్రధాన మంత్రి వెన్‌ జియాబావోలు అప్పటి ఉప ప్రధానిగా ఉన్న జిన్‌పింగ్‌కు పార్టీ సంప్రదాయం ప్రకారం అధికారాలు బదిలీ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top