ప్లాస్టిక్‌ సర్జరీలపై చైనా బ్యాన్‌!

Chinese Legislature Decided To Ban Youth Getting Plastic Surgeries - Sakshi

బీజింగ్‌ : చైనాలో యువత ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవటంపై అక్కడి ప్రభుత్వం నిషేదం విధించాలని చూస్తోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. చైనాలో ప్లాస్టిక్‌ సర‍్జరీ ఇండస్ట్రీ శరావేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం 20 మిలియన్ల మంది ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించున్నారని ప్రముఖ వెబ్‌సైట్‌ ‘‘సో యంగ్‌’’ తెలిపింది. అందానికి మెరుగులు దిద్దాలనే ఆలోచనతో అక్కడి యువత ఎక్కువగా ప్లాస్టిక్‌ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. చిన్న లోపాలను సైతం సరిచేయటానికి సర్జరీలకు వెళుతున్నారు.

పెద్దపెద్ద కళ్లు, కొనతేలిన గడ్డం, చిన్న ముఖం కోసం చైనా యువత ఎక్కువగా సర్జరీలు చేయించుకుంటోంది. దీంతో సర్జరీలు వికటించిన సందర్బాల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కుంటున్నారు. ఒకనొక సమయంలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి. అందం కోసం కత్తిగాట్ల సంస్కృతి పెరగటం ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధిస్తోన్న సమస్యగా మారింది. ఇది ఇలాగే కొనసాగితే భావితరాలపై దీని ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయానికి వచ్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top