పబ్లిగ్గా ప్యాంటు విప్పిన కోతి! | cheeky monkey Hilarious moment | Sakshi
Sakshi News home page

వామ్మో ఆ కోత్తి ఎంత కోతి పనిచేసింది!

Apr 3 2016 4:00 PM | Updated on Sep 3 2017 9:08 PM

పబ్లిగ్గా ప్యాంటు విప్పిన కోతి!

పబ్లిగ్గా ప్యాంటు విప్పిన కోతి!

కోతులను ఆడించి ప్రజలను వినోదపరచడం కూడా ఓ కళ.

కోతులను ఆడించి ప్రజలను వినోదపరచడం కూడా ఓ కళ. ఇప్పటికీ ఊర్లలో గారడీ విద్య ప్రదర్శించేవాళ్లు, సర్కస్ నిర్వహించే వాళ్లు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. కోతులను ఆడించి.. వాటితో రకరకాలు విన్యాసాలు చేయించి.. ప్రజల్ని ఆనందపరుస్తారు. వారిచే పదోపరకో తీసుకొని పొట్టపోసుకుంటారు.

చైనాలో కూడా ఇలాగే ఓ కోతులు ఆడించే వ్యక్తి ప్రజల్ని వినోదపరచడానికి ప్రయత్నించాడు. తన కోతిమూకతో బజారులో ప్రదర్శన పెట్టాడు. కానీ అవి మామూలు కోతులు కాదు.. మహా ముదుర్లు. వాటిని ఆడించే క్రమంలో ఓ కోతి అతని జుట్టు పట్టుకొని పీకగా.. మరో కోతి వెనుక నుంచి వచ్చి అతని ప్యాంటును కిందకు లాగేసింది. అంతే అర్ధనగ్నంగా మారిన అతన్ని చూసి.. ప్రజలంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయినా ఏమాత్రం చెదరకుండా తన ప్యాంటును తిరిగి పైకి లాక్కొని.. మర్కటాలతో విన్యాసాలు చేయించి భేష్ అనిపించుకున్నాడు ఆ సర్కస్ మనిషి. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని లౌయంగ్‌ పట్టణంలో గత నెల 15న ఈ ఘటన జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.

చైనాలో ఇటీవలికాలంలో జంతువుల వినియోగం బాగా పెరిగింది. కోతులకు శిక్షణ ఇచ్చి వాటిద్వారా చెట్లపైన ఉన్న పక్షుల గూళ్లను తొలగించే కార్యక్రమాన్ని అక్కడి అటవీశాఖ చేపట్టింది. విమాన రాకపోకలకు అంతరాయ కలుగకుండా ఇలా కోతుల సేవలను వినియోగించుకుంటోంది. అలాగే హెనాన్ ప్రావిన్స్‌లో పర్యాటకులను బాగా ఆకట్టుకునేందుకు కోతులు విన్యాసాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement