సెన్సార్‌ తెరలతో యాక్సిడెంట్‌లకు చెక్‌ | Censor Screens check to Accidents at Signals | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 11:56 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Censor Screens check to Accidents at Signals - Sakshi

సాక్షి, టెక్నాలజీ : ట్రాఫిక్‌ కూడళ్లలో సిగ్నల్‌ లైట్లు పడినా వాహనదారులు ఒక్కోసారి దూసుకుపోవటం.. లేదా వాహనాల మధ్య నుంచే రోడ్డును దాటాలని పాదాచారులు చేసే ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయటం చూస్తున్నాం. అయితే సాంకేతికతకు మరింత ఆధునీకరణ తోడైతే అలాంటి ఘటనలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సెన్సార్‌ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు.

దీని ప్రకారం సిగ్నల్‌ వద్ద ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్‌ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం వెళ్తుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు నిరభ్యరంతంగా రోడ్డును దాటేయొచ్చు. 

ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌ నగరంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించగా.. అది సత్ఫలితాన్ని ఇస్తోంది. త్వరలో దీనిని వివిధ దేశాలకు విస్తరించాలని ప్రాజెక్టును చేపట్టిన యూ-కోరీచన్‌ సంస్థ ఆలోచన చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement