‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు | 'Bright Spot' on Ceres Has Dimmer Companion | Sakshi
Sakshi News home page

‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు

Feb 28 2015 3:38 AM | Updated on Sep 2 2017 10:01 PM

‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు

‘సీరీజ్’పై మరో వెలుగు చుక్కలు

మరుగుజ్జు గ్రహం సీరీజ్‌పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది.

మరుగుజ్జు గ్రహం సీరీజ్‌పై మరో ప్రకాశవంతమైన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆ గ్రహంపైకి పంపిన డాన్ వ్యోమనౌక గుర్తించింది. సీరీజ్ ఉపరితలం నుంచి దాదాపు 46వేల కిలోమీటర్ల దూరం నుంచి డాన్ వ్యోమనౌక తీసిన ఈ ఛాయాచిత్రాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వెలుగులు గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాల నుంచి వెలువడిన ఉద్గారాలు కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే ఇంకా స్పష్టంగా కనిపించేంత వరకు కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. ఈ డాన్ వ్యోమనౌక సీరీజ్ కక్ష్యలోకి మార్చి 6న ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈ ప్రకాశవంతమైన ప్రదేశాన్ని స్పష్టంగా చూసి దాని గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2012లో సీరీజ్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిని కనుగొన్నారు. గ్రహ ఉపరితలంపై నీటిని కలిగి ఉన్న ఖనిజాలు ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement