‘అక్రమ భారతీయుల’కు సాయం చేస్తాం | Breather for over 24000 illegal Indian workers in Kuwait | Sakshi
Sakshi News home page

‘అక్రమ భారతీయుల’కు సాయం చేస్తాం

Dec 9 2016 6:51 PM | Updated on Sep 4 2017 10:18 PM

కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త!

కువైట్‌ సిటీ: కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త! ఆ దేశంలో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతామన్నా.. లేదా ఉద్యోగ వీసాల బదిలీ కోసం హోం శాఖను సంప్రదిస్తే.. వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబోమని కువైట్‌ ప్రభుత్వం ప్రకటించింది. వారికి సాయం చేయడానికి తమ ఇమిగ్రేషన్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.

కఠిన శిక్షలు ఉండే కువైట్‌ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చాలా అరుదు. కువైట్‌లో ప్రస్తుతం దాదాపు 24 వేల మంది భారతీయులు అక్రమంగా పనిచేస్తున్నారని అంచనా. ఇలా ఇప్పటికే రెండు వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement