అవినీతి కేసులో విచారించేందుకు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
	సావో పాలో: అవినీతి కేసులో విచారించేందుకు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లులా ఇంటిని సోదా చేసి ఆయనను ప్రశ్నించారు.
	
	శుక్రవారం సావో పాలోలోని లులా నివాసం, కార్యాలయం, కుటుంబ సభ్యుల నివాసాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బ్రెజిల్ రాజకీయాల్లో లులా శక్తిమంతమైన నేత.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
