అమెరికాలో భారత చిన్నారి కథ విషాదాంతం? | Body found in tunnel most likely of missing 3-year-old Indian girl, say Texas police | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత చిన్నారి కథ విషాదాంతం?

Oct 23 2017 10:03 AM | Updated on Apr 4 2019 3:25 PM

Body found in tunnel most likely of missing 3-year-old Indian girl, say Texas police - Sakshi

టెక్సస్‌ : పాలు తాగలేదని, కన్నతండ్రి ఇంటి నుంచి బయటకు పంపేసిన చిన్నారి షెరిన్‌ మాథ్యూస్‌ కథ విషాదాంతమైందా?. టెక్సస్‌ పోలీసులు చెబుతున్న వివరాలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. పాలు తాగట్లేదని తన మూడేళ్ల కుమార్తెను ఇంటి నుంచి బయటకు పొమ్మన్నాడు వెస్లీ మాథ్యూస్‌. రాత్రంతా ఇంట్లోకి రావొద్దంటూ శిక్ష విధించాడు.

కొద్దిసేపటికి బయటకు వచ్చి చూసిన తండ్రికి షెరిన్‌ కన్పించకుండా పోయింది. దాదాపు రెండు వారాల అనంతరం మాథ్యూస్‌ ఇంటి సమీపంలోని డ్రైనేజిలోని టన్నెల్‌లో చిన్నపాప మృతదేహాన్ని టెక్సస్‌ పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం షెరిన్‌దేనని అనుమానిస్తున్నారు. బాలికను అర్థరాత్రి ఇంటి బయట నిలబెట్టినందుకు వెస్లీ మాథ్యూస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షెరిన్‌ భారత్‌లో జన్మించింది. మాథ్యూస్‌ కుటుంబం ఆమెను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement