బ్లాక్‌బస్టర్‌ బ్యాటరీ...

బ్లాక్‌బస్టర్‌ బ్యాటరీ...

వాట్లు.. కిలోవాట్లు కాదు.. ఏకంగా వంద మెగావాట్లు! ఆస్ట్రేలియాలో విద్యుత్‌ను నిల్వ చేసుకునేందుకు సిద్ధమవుతున్న ఓ భారీ బ్యాటరీ సామర్థ్యం ఇది. ఇంత భారీ సైజు బ్యాటరీ తయారవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఈ భారీ బ్యాటరీ సిద్ధమవుతోంది. దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కోతల నివారణకు తగిన మార్గాలు చూపాల్సిందిగా స్థానిక ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కంపెనీలకు ఆహ్వానం పలికింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 91 కంపెనీలు పోటీపడ్డాయి.



అయితే అవకాశమిస్తే కేవలం వంద రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి చేసి కరెంటు కోతల్లేకుండా చేస్తానని లేదంటే అందరికీ ఉచితంగా కరెంటు పంచిపెడతానని ట్వీట్టర్‌ వేదికగా మస్క్‌ సవాలు విసిరారు. తాజాగా ఈ కాంట్రాక్ట్‌ మస్క్‌కే దక్కడంతో వంద మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీని తయారు చేస్తానని హామీనిచ్చారు. గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఈ బ్యాటరీలో నిల్వ చేసి కోతల సమయంలో అందరికీ సరఫరా చేస్తానని మస్క్‌ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తయ్యే వంద మెగావాట్ల బ్యాటరీతో దాదాపు 30 వేల ఇళ్లకు విద్యుత్‌ అందుతుంది. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top