కొంచెం నీరు.. కొంచెం నిప్పు.. | best photograph on Volcano | Sakshi
Sakshi News home page

కొంచెం నీరు.. కొంచెం నిప్పు..

Oct 29 2014 2:31 AM | Updated on Sep 5 2018 9:45 PM

కొంచెం నీరు.. కొంచెం నిప్పు.. - Sakshi

కొంచెం నీరు.. కొంచెం నిప్పు..

అగ్నిపర్వతం పేలి లావా సముద్రుడిలో ఒదిగిపోతున్న అద్భుత సన్నివేశం.. నీరు, నిప్పు కలుస్తున్న సమయంలో బుస్సుమంటూ లేస్తున్న పొగలు..

అగ్నిపర్వతం పేలి లావా సముద్రుడిలో ఒదిగిపోతున్న అద్భుత సన్నివేశం.. నీరు, నిప్పు కలుస్తున్న సమయంలో బుస్సుమంటూ లేస్తున్న పొగలు.. ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఆండ్రూలీ తీశారు. నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలిసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో ‘ప్రకృతి సృష్టించిన డిజైన్’ కేటగిరీలో ఇది ఫైనలిస్టుగా నిలిచింది.   హవాయిలోని హిలో పట్టణ సమీపంలో అగ్నిపర్వతం పేలి లావా సముద్రంలో కలవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారని.. ఆ విషయం తెలియగానే తానక్కడికి చేరుకున్నానని.. భారీ వర్షం, గాలుల మధ్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. ఈ చిత్రాన్ని తీశానని ఆండ్రూలీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement