బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం! | Bangladesh may drop Islam as country official religion following attacks on minorities | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం!

Mar 6 2016 1:03 PM | Updated on Sep 3 2017 7:09 PM

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం!

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం!

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ అధికార మతంగా ఇస్లాంను బంగ్లాదేశ్‌ తొలగించే అవకాశముంది. ఇటీవల దేశంలోని ఇతర విశ్వాసాలు గల ప్రజలపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందువులు, ముస్లింలోని షియా వర్గాలు లక్ష్యంగా ఇటీవల దాడులు జరిగాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ దాడులు చేసినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధికార మతంగా ఇస్లాంను తొలగించాలని అంశానికి అనుకూలంగా ఆ దేశ సుప్రీంకోర్టు వాదనలు వింటోందని 'డైలీ మెయిల్' ఓ కథనంలో తెలిపింది. 1988 నుంచి బంగ్లాదేశ్ అధికార మతంగా ఇస్లాం కొనసాగుతోంది. దీనిని వివిధ మైనారిటీ మతాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. దేశ అధికార మతంగా ఇస్లాంను కొనసాగించడం చట్టవ్యతిరేకమని వారు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

అయితే ఈ నిర్ణయానికి ప్రజామద్దతు లభిస్తుందా అనేదానిపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో 90శాతం మంది ముస్లింలు ఉండగా 8శాతం మంది హిందువులు, రెండు శాతంమంది ఇతర మైనారిటీ మతాల వారు ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్ పంచగఢ్ జిల్లాలో ఓ హిందూ పూజారిని దేవాలయంలోనే కొట్టిచంపగా, కొన్ని సంవత్సరాలుగా మైనారిటీ బ్లాగర్స్‌ను దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇస్లామిక్ గ్రూపులైన జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా టీంలు ఈ దారుణాల వెనుక ఉన్నట్టు భావిస్తున్నారు. మరోవైపు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు ఉనికి కూడా దేశంలో పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రాముఖ్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement