యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు మంగళవారం వరుసగా ఆరో రోజూ దాడులను ఉధృతం చేశాయి.
సనా: యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు మంగళవారం వరుసగా ఆరో రోజూ దాడులను ఉధృతం చేశాయి. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, క్షిపణులు, ఆయుధాగారాలను బాంబుదాడులతో ధ్వంసం చేశాయి. కూటమి యుద్ధనౌకలు కూడా తొలిసారిగా రంగంలోకి దిగి ఆడెన్‌లోని రెబెల్స్ అధీనంలో ఉన్న విమానాశ్రయంపై దాడి చేశాయి.