పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో ఘాతుకానికి పాల్పడింది తామేనని తెహరీక్- ఎ- తాలిబన్- పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
పెషావర్ నగరంలోని ఆర్మీ స్కూల్లో ఘాతుకానికి పాల్పడింది, 20 మంది పిల్లలను హతమార్చింది తామేనని తెహరీక్- ఎ- తాలిబన్- పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే తాము పెద్ద పిల్లలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని, పిల్లలను వదిలేయాలని సూచించామని ఆ ఉగ్రవాద సంస్థ తెలిపింది. సుమారు 500 మందికి పైగా విద్యార్థులతో పాటు అక్కడున్న ఉపాధ్యాయులు కూడా ఉగ్రవాదుల చెరలో ఉన్నారు.
కేవలం ఆరుగురు ఉగ్రవాదులే అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి సుమారు 20 మంది పిల్లలను ఉగ్రవాదులు హతమార్చారు. ఇది కేవలం ప్రతీకార చర్య అని , ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో సైనిక చర్యకు ప్రతీకారంగానే ఇలా చేశామని టీటీపీ నేతలు చెప్పారు. దాడికి పాల్పడిన వాళ్లు ఎవరైనా సహించేది లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు.