నన్‌ వేషంలో డ్రగ్స్‌ సరఫరా.. పట్టేసిన పోలీస్‌ డాగ్‌

Arizona women dressed as nun supplies Drugs - Sakshi

అరిజోనా : చేతిలో బైబిల్‌ పట్టుకుని, నన్‌ వేషధారణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ మహిళను పోలీస్‌ డాగ్‌ పట్టేసింది. అరిజోనాలోని యుమాకు చెందిన ఈస్తెర్‌ గొమేజ్‌ డీ అగులార్‌(53) తన భర్తతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా నన్‌ వేషంలో డ్రగ్స్‌ సరఫరా చేయాలనుకుంది. 90 వేల డాలర్ల(దాదాపు రూ.63 లక్షలు) విలువైన సింథటిక్‌ ఓమియాడ్‌ డ్రగ్‌ ఫెంటానిల్‌ను అక్రమంగా సరఫరా చేయడానికి అగులార్‌ నన్‌ వేషాన్ని ఎంచుకుంది.

అయితే పినాల్‌ కౌంటీలో ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించినందుకు ఓ పోలీసు అధికారి వారి కారును అడ్డుకుని కిందకు దింపి మాట్లాడారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పోలీస్‌ డాగ్‌  డ్రగ్స్‌ వాసన పసిగట్టి అగులార్‌పైకి అరవసాగింది. దీంతో అమెను చెక్‌ చేయగా హ్యాండ్‌బ్యాగ్‌లో, వస్త్రాల్లో డ్రగ్స్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ 8.5 పౌండ్ల డ్రగ్స్‌ను తీసుకెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top