బీబీసీ వెబ్సైట్ హ్యాక్ | Anti-ISIS group claims BBC website hack | Sakshi
Sakshi News home page

బీబీసీ వెబ్సైట్ హ్యాక్

Jan 2 2016 7:19 PM | Updated on Sep 3 2017 2:58 PM

బీబీసీ వెబ్సైట్ హ్యాక్

బీబీసీ వెబ్సైట్ హ్యాక్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే ఓ హ్యాకర్స్ గ్రూప్.. బీబీసీ నెట్వర్క్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు వెల్లడించింది.

లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే ఓ హ్యాకర్స్ గ్రూప్.. బీబీసీ నెట్వర్క్ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు వెల్లడించింది. కొత్త ఏడాది సందర్భంగా ముందు రోజు గురువారం కొన్ని గంటల పాటు బీబీసీ వెబ్సైట్లు పనిచేయలేదు.

ఈ వార్తపై బీబీసీ యాజమాన్యం స్పందించలేదు. హ్యాకర్లు దాడి చేసిన విషయన్ని ధ్రువీకరించడం కానీ తోసిపుచ్చడం కానీ చేయలేదు. కాగా ఐఎస్ సభ్యులు, అనుబంధ వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటామని హ్యాకర్స్ గ్రూప్ వెల్లడించింది. తమ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బీబీసీ వెబ్సైట్లను హ్యాక్ చేసినట్టు హ్యాకర్స్ గ్రూప్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement