అమెజాన్‌ సీఈవో సంచలన ప్రకటన | Amazon founder Jeff Bezos and wife divorcing after 25 years | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ సీఈవో సంచలన ప్రకటన

Jan 10 2019 8:21 AM | Updated on Jan 10 2019 2:52 PM

Amazon founder Jeff Bezos and wife divorcing after 25 years - Sakshi

జెఫ్‌ బెజోస్‌ దంపతులు (పైల్‌ ఫోటో)

ప్రముఖ ఆన్లైన్ వ్యాపారం దిగ్గజం అమెజాన్ పౌండర్, సీఈవో, జెఫ్ బెజోస్‌(54) సోషల్‌ మీడియా ద్వారా బుధవారం సంచలన  ప్రకనట చేశారు. భార్య మెక్కెంజేతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించు కున్నట్టు ట్విటర్‌లో షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించారు. మా జీవితాల్లో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని హితులు, సన్నిహితుల దృష్టికి తీసుకొస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, అయితే విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు.

మెకెంజీ (48) మంచి రచయిత్రి. న్యూయార్క్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే  తన రచనలకు, మొదటి బెస్ట్‌ రీడర్‌ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతోపాటు  మెకంజీ  బైస్టాండర్‌ రివల్యూషన్‌  (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు.

1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అమెజాన్‌ భారీ మార్కెట్‌ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌ను వెనక్కినెట్టి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో ప్రశ్నల్ని సశేషంగా మిగిల్చిన ఈ హఠాత్పరిణామం అమెజాన్‌​ వాటాదారుల్లో తీవ్ర అందోళన రేపింది. అమెజాన్ యాజమాన్య మార్పునకు తీస్తుందా అనే సందేహాలు  పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి.  

టీవీ యాంకర్‌తో   చెట్టాపట్టాల్‌
ఇది ఇలా ఉంటే ఫాక్స్11 టీవీ యాంకర్ లారెన్ శాంచెజ్ ఇటీవల సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. గత 8నెలలుగా కొన్ని ప్రముఖప్రదేశాల్లో జెఫ్, లారెన్ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ సుమారు  డజనుకు పైగా సార్లు తమ ఫోటోగ్రాఫర్లు కంట పడ్డారని యూ​కే ఆధారిత పత్రిక పేర్కొంది. జెఫ్‌ బెజోస్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బ్లూ ఆరిజన్‌  కోసం ఒక ఏరియల్‌  వీడియో షూటింగ్‌ సందర్భంగా ఆమెను కలుసు కున్నారని తెలిపింది.  అంతేకాదు గత ఆదివారం అమెజాన్ నిర్వహించిన  గోల్డెన్ గ్లోబ్ పార్టీలో  వీరిద్దరి కలిసి కనిపించారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement