శాన్ ఫ్రాన్సిస్కోలో విద్యార్థులపై కాల్పులు | 4 shot outside San Francisco schools | Sakshi
Sakshi News home page

శాన్ ఫ్రాన్సిస్కోలో విద్యార్థులపై కాల్పులు

Oct 19 2016 10:17 AM | Updated on Sep 15 2018 5:06 PM

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది.

శాన్ ఫ్రాన్సిస్కో :  అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పలువురు విద్యార్థులు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈక్విటీ జూన్ జోర్డాన్ స్కూల్ సిటీ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ హైస్కూల్ బయట ఈ కాల్పులు జరిగాయి.

నల్లటి ముసుగులు ధరించిన నలుగురు ఆగంతకులు... తరగతి గదుల్లోకి నడిచి వెళుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా  కాల్పులు జరిపినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసు అధికారి కార్లస్ మాన్ఫ్రెడీ తెలిపారు. కాల్పుల అనంతరం అక్కడ నుంచి దుండగులు పరారీ అయినట్లు చెప్పారు.  దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు కాల్పుల్లో గాయపడ్డ తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా దుండగులు మహిళా విద్యార్థినులనే లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్లు ఫ్రాన్సిస్కో యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి తెలిపారు.

San Francisco shot, students,school campus,  అమెరికాలో కాల్పులు, శాన్‌ ఫ్రాన్సిస్కోలో విద్యార్థులపై కాల్పులు, దుండగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement