కొండచరియలకు వైద్య దంపతులు బలి | 2 Indian doctors killed in Nepal landslide | Sakshi
Sakshi News home page

కొండచరియలకు వైద్య దంపతులు బలి

Jun 18 2015 10:54 AM | Updated on Oct 20 2018 6:37 PM

కొండచరియలకు వైద్య దంపతులు బలి - Sakshi

కొండచరియలకు వైద్య దంపతులు బలి

నేపాల్లో ఇద్దరు భారతీయ వైద్య దంపతులు మృత్యువాత పడ్డారు. లుంబినీ జోన్ లో తాము వెళుతున్న కారుపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు

కఠ్మాండు: నేపాల్లో ఇద్దరు భారతీయ వైద్య దంపతులు మృత్యువాత పడ్డారు. లుంబినీ జోన్ లో తాము వెళుతున్న కారుపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం డాక్టర్ తరుణ్ దీప్ సింగ్(కంటి వైద్యుడు), అతడి భార్య యశోద కొచ్చర్ (గైనకాలజిస్ట్) బుతావల్ నుంచి పాల్పా వద్ద గల ఆస్పత్రికి వెళుతుండగా బైర్వాడా జిల్లాలోని సిద్ధబాబా ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు.

ఒక్కసారిగా కుప్పపోసినట్లుగా బురద, రాళ్లు వారి కారుపై పడ్డాయి. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ వారు తీవ్ర గాయాలవల్ల చనిపోయారు. బుధవారం పలుమార్లు నేపాల్ లో భూమి కంపించడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement