భవనం కూలి 15 మంది మృతి | Sakshi
Sakshi News home page

భవనం కూలి 15 మంది మృతి

Published Tue, Nov 25 2014 9:34 PM

15 killed in Egypt building collapse

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో భవనం కూలి 15 మంది మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గతంలో నిర్మితమై ఉన్న మతారియా సుబుర్బ్ భవనానికి అదనంగా మరికొన్ని ఫ్లోర్ లను వేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రక్షణ దళాలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయని కైరో పౌర రక్షణ విభాగం జనరల్ డైరెక్టర్ మామ్ దో అబ్దుల్ ఖాదిర్ స్పష్టం చేశారు.
 

ఆ భవనం శిథిలావస్థకు చేరడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. అందులో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయమని ఇది వరకే హెచ్చరించామని.. అయితే వారు తమ మాటను పెడ చెవిన పెట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement