చవకగా బ్రెయిలీ ప్రింటర్ | 12-Year-Old Invents Braille Printer Using Lego Set | Sakshi
Sakshi News home page

చవకగా బ్రెయిలీ ప్రింటర్

Feb 23 2014 11:49 PM | Updated on Sep 2 2017 4:01 AM

చవకగా బ్రెయిలీ ప్రింటర్

చవకగా బ్రెయిలీ ప్రింటర్

అంధులకు ఉపయోగపడేలా తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ను అమెరికాలో భారత సంతతికి చెంది న 12 ఏళ్ల శుభమ్ బెనర్జీ రూపొందిం చాడు.

 భారత సంతతికి చెందిన 12 ఏళ్ల విద్యార్థి రూపకల్పన


 న్యూయార్క్: అంధులకు ఉపయోగపడేలా తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ను అమెరికాలో భారత సంతతికి చెంది న 12 ఏళ్ల శుభమ్ బెనర్జీ రూపొందిం చాడు. ఎలక్ట్రానిక్ ఆట వస్తువు ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’ తో దీనిని రూపొం దించడం గమనార్హం. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు.. చిన్న భాగాలను కలిపి వేర్వేరు ఆట బొమ్మల్ని తయారే చేసేందుకు తోడ్పడే ఎలక్ట్రానిక్ కిట్ ఈ ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’. దీనికి మరికొన్ని భాగాలను చేర్చి.. ‘బ్రెయిగో’ పేరుతో బ్రెయిలీ ప్రింటర్‌ను బెనర్జీ తయారు చేశాడు.
 
 బ్రెయిలీ భాష లో ఏ నుంచి జెడ్ వరకూ అక్షరాలను, అంకెలను దీనితో కాగితంపై ప్రింట్ చేయవచ్చు. ఒక్కో అక్షరాన్ని ప్రింట్ చేయడానికి ఇది ఏడు సెకన్ల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఏడో తరగతి చదువుతున్న శుభమ్ బెనర్జీ... తాను రూపొందించిన ఈ డిజైన్‌ను, ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందజేస్తానని చెబుతున్నాడు. దీనితో అక్షరాలను ప్రింట్ చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు కూడా. సాధారణంగా బ్రెయిలీ ప్రింటర్ ధర రూ. లక్షన్నర వరకూ ఉండగా... ‘బ్రెయిగో’ను రూ. 20 వేలతో తయారు చేసుకోవచ్చు.
 
 

Advertisement

పోల్

Advertisement