ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి | 12 people killed in Russia road accident | Sakshi
Sakshi News home page

ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి

Dec 5 2016 12:13 PM | Updated on Sep 4 2017 9:59 PM

ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి

ట్రక్కు, స్కూలు బస్సు ఢీ: 12 మంది మృతి

రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మాస్కో: రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంటి-మాన్సియాక్ హైవేపై స్కూలు బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11మంది చిన్నారులతో సహా 12మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఆటల పోటీల్లో పాల్గొని తిరుగు పయనమైన ఆక్రోబాటిక్స్ జట్టు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో 29 మంది 12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు ఉండగా మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. పొగ మంచు దట్టంగా ఉండి దారులు కనిపించకపోవడంతో ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంటి-మాన్సియాక్లో ఒక రోజు సంతాపదినంగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement