భారత సంతతి బాలిక తెలివి భేష్! | 11-year-old Indian-origin girl in US sells secure passwords | Sakshi
Sakshi News home page

భారత సంతతి బాలిక తెలివి భేష్!

Nov 1 2015 4:28 PM | Updated on Sep 3 2017 11:50 AM

భారత సంతతి బాలిక తెలివి భేష్!

భారత సంతతి బాలిక తెలివి భేష్!

భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని తన తెలివితేటలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని తన తెలివితేటలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 11 ఏళ్ల వయసున్న మిరా మోదీ సొంతంగా వ్యాపారం ప్రారంభించింది. ఏదో నామమాత్రంగా స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు. న్యూయర్క్ నగరానికి చెందిన ఈ బాలిక ఏకంగా సెక్యూర్ పాస్వర్డ్స్ను రూపొందించి అమ్ముతుంటుంది. డైస్ రోల్స్ను వాడి పాస్వర్డ్స్ క్రియేట్ చేసి కేవలం రెండు అమెరికా డాలర్లకే సేల్స్ చేస్తుంది. డైస్ రోల్ చేయగా వచ్చిన నంబర్లను వాడి వాటికి సంబంధించిన ఇంగ్లీష్ లెటర్స్ను క్రియేట్ చేయడమే డైస్వేర్ టెక్నిక్. మిరా ప్రస్తుతం

అలా చేసిన పాస్వర్డ్లను అంత సులువుగా ఇతరులు కనిపెట్టలేరట. వీటిలో చాలా కచ్చితత్వం ఉండటంతో పాటు అవి సులువుగా గుర్తుంటడం మరీ విశేషం. తన స్నేహితులు వీటిని అర్థం చేసుకుంటారో లేదో గానీ ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందని మిరా మోదీ చెప్పింది. స్కూలుకు సంబంధించి ఏదో వర్క్ నిమిత్తం తల్లి జులియా అంగ్విన్ని అడగగా తనకు ఈ సలహా ఇచ్చిందని, దానిని తాను బిజినెస్గా చేసుకున్నానని వివరించింది. డైస్ రోల్ చేసి వచ్చిన నంబర్లకు సరిపోయే ఇంగ్లీష్ పదాలు వాడి పాస్వర్డ్ చేసి దానిని పోస్ట్ ద్వారా కస్టమర్లకు పంపిస్తుంటానని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement