సైనిక విమాన ప్రమాదంలో 11మంది మృతి | 11 killed in Colombia military plane accident Bogota | Sakshi
Sakshi News home page

సైనిక విమాన ప్రమాదంలో 11మంది మృతి

Aug 1 2015 9:04 AM | Updated on Sep 3 2017 6:35 AM

సైనిక విమాన ప్రమాదంలో 11మంది మృతి

సైనిక విమాన ప్రమాదంలో 11మంది మృతి

కొలంబియా సైనిక విమాన ప్రమాదంలో 11 మంది వైమానిక దళ సిబ్బంది మృతిచెందారు.

బొగొటా: కొలంబియా సైనిక విమాన ప్రమాదంలో  11 మంది వైమానిక దళ సిబ్బంది మృతిచెందారు. యాంత్రిక సమస్యలు తలెత్తడంతో ఎఫ్ఏసీ 1261 నంబర్ గల ఏకాసా 235 రవాణా విమానం సీజర్ ప్రాంతంలోని లాస్ పాల్మోస్ జోన్లో ప్రమాదానికి గురైనట్టు ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. మృతిచెందిన వారిలో ఒక మేజర్, అనుచరుడు సహా 9 మంది ఉన్నట్టు తెలిపింది.

అయితే ఈ ఘటనపై తొలుత12 మంది మృతిచెందినట్టు ఆ దేశ అధ్యక్షుడు జుయాన్ మాన్యెల్ శాంటోస్ ట్విట్లర్ లో పేర్కొన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన ట్విట్లర్ ద్వారా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆ తరువాత రక్షణ దళం సైనిక విమానం ప్రమాదంలో 11 మంది వైమానిక దళ సభ్యులు మృతిచెందినట్టుగా తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

పోల్

Advertisement