ఎస్సీ, ఎస్టీ సంక్షేమంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సంక్షేమంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. మంగళవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.
ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉపాధిహామీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని చెప్పారు. ఉపాధిహామీ నిధులతో సిమెంట్ రోడ్లు వేస్తామని అధికార టీడీపీ నేతలు చెబుతున్నారని, పేదల కడుపు నింపే పథకం నిధులను మళ్లిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.