గాంధీ, శాస్త్రిలకు వైఎస్ జగన్ ఘన నివాళి | ys jagan mohan reddy Tributes to mahatma gandhi, lal bahadur shastri birthday celebrations | Sakshi
Sakshi News home page

గాంధీ, శాస్త్రిలకు వైఎస్ జగన్ ఘన నివాళి

Oct 2 2016 11:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

గాంధీ, శాస్త్రిలకు వైఎస్ జగన్ ఘన నివాళి - Sakshi

గాంధీ, శాస్త్రిలకు వైఎస్ జగన్ ఘన నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు.

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ, లాల్ బహదూర్శాస్త్రి చిత్రపటాలకు నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, గట్టు శ్రీకాంత్రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.


మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలను సేవలను శ్లాఘిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ఇద్దరూ గొప్ప నాయకులు. జాతిపై శాశ్వత ముద్ర వేశారు. అహింస, లౌకికవాదంతో గాంధీ.. సైనికులు, రైతుల కోసం పనిచేసిన శాస్త్రి శాశ్వతంగా నిలిచార’ని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement