గుడికి వెళ్లిన యువతి అదృశ్యం | young woman missing in ramgopalpet | Sakshi
Sakshi News home page

గుడికి వెళ్లిన యువతి అదృశ్యం

Sep 28 2015 10:11 AM | Updated on Aug 1 2018 2:15 PM

సునయన(ఫైల్) - Sakshi

సునయన(ఫైల్)

గుడికని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది.

సికింద్రాబాద్: గుడికని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. రాంగోపాల్‌పేట్ మార్కెట్ ఎస్‌ఐ వేణుగోపాల్ కథనం ప్రకారం... శివాజీనగర్‌కు చెందిన దిలీప్‌చంద్ శర్మ కుమార్తె సునయన శర్మ (25) తండ్రి చనిపోవడంతో అన్నయ్యతో కలిసి ఉంటోంది. ఈనెల 26న ఉదయం సునయన శర్మ గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి, సాయంత్రం అయినా తిరిగి రాలేదు.

దీంతో సోదరుడు పవన్‌శర్మ బంధు, మిత్రుల ఇళ్లల్లో ఆరా తీసినా ఆచూకీ దొరక్కపోవడంతో రాత్రి  మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివాజీనగర్‌లో ఉండే శ్రవన్ అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునయన శర్మ ఆచూకీ తెలిసిన వారు మార్కెట్ పోలీస్‌స్టేషన్ నంబర్ 040-27853598, 8333900083 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement