టైలర్ దుకాణానికి వెళ్లి యువతి అదృశ్యం | women missing missing while went for tailor shop | Sakshi
Sakshi News home page

టైలర్ దుకాణానికి వెళ్లి యువతి అదృశ్యం

Jan 25 2017 9:32 PM | Updated on Sep 5 2017 2:06 AM

ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నగరంలో చోటు చేసుకుంది.

హైదరాబాద్‌: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ డివిజన్‌ వివేకానంద నగర్‌కు చెందిన నర్సప్ప కుమార్తె బి.సరిత(18) ఇంటి వద్దనే ఉంటుంది. మంగళవారం ఉదయం బట్టలు కుట్టించుకోవడానికి ఇంటి నుంచి టైలరింగ్‌ దుకాణానికి వెళ్లిన సరిత రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తండ్రి నర్సప్ప బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement