ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం... | Woman have been harrassing and rape for 8 years | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం...

May 30 2016 10:20 PM | Updated on Sep 4 2017 1:16 AM

ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం...

ఎనిమిదేళ్ల నుంచి ఆమెపై అత్యాచారం...

ఎనిమిదేళ్లుగా ఓ వివాహితను బలవంతంగా లోబర్చుకుంటున్నాడో కీచకుడు.

పహడీషరీఫ్: ఎనిమిదేళ్లుగా ఓ వివాహితను బలవంతంగా లోబర్చుకుంటున్నాడో కీచకుడు. కీచకుని చెరలో బంధీలా తనంతో మనోవేదనకు గురైన మహిళ.. ఈ విషయం బయటకు చెబితే తన భర్తను చంపేస్తానని బెదిరించడంతో నోరు విప్పలేదు. చివరికి కీచకుడి వ్యవహారం తన భర్తకు తెలియడంతో అసలు విషయాన్ని రోదిస్తూ చెప్పింది. ఈ సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌ష్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రకుంట జమ్‌జమ్ కాలనీకి చెందిన 28 ఏళ్ల గృహిణీని సాదత్‌నగర్‌కు చెందిన అహ్మద్ జాసిన్ లతీఫ్ ఖాన్ (26) ఎనిమిదేళ్ల క్రితం మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానంటూ బెదిరించాడు. అప్పటి నుంచి లతీఫ్ ఖాన్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలోనే జల్‌పల్లిలో ఒక గది తీసుకొని ఏడాది పాటు ఆమెతో ఉన్నాడు. ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా నిందితుడు పలుమార్లు తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement