మూసీనదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు రక్షించారు.
మూసీనదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం ఉదయం అత్తాపూర్ సమీపంలో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ మహిళ దిగువన ఉన్న మూసీ నదిలోకి దూకింది.
అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, ఆమెను కాపాడగలిగారు. ఆమె ఎందుకు ఆత్మహత్యాప్రయత్నం చేసిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సమయానికి పోలీసులు స్పందించడం వల్ల ఆమె ప్రాణాలు దక్కించుకోగలిగిందని స్థానికులు అంటున్నరు.