కేటీఆర్ సతీమణికి ఓటు ఎక్కడ? | Where to vote KTR wife? | Sakshi
Sakshi News home page

కేటీఆర్ సతీమణికి ఓటు ఎక్కడ?

Feb 2 2016 1:17 AM | Updated on Aug 30 2019 8:24 PM

కేటీఆర్ సతీమణికి ఓటు ఎక్కడ? - Sakshi

కేటీఆర్ సతీమణికి ఓటు ఎక్కడ?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని గడిచిన మూడు వారాల నుంచి నిర్విరామ

సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని గడిచిన మూడు వారాల నుంచి నిర్విరామ ప్రచారం చేసి గ్రేటర్‌పై గులాబీజెండా ఎగురవేస్తామని ధీమాగా ఉన్న మంత్రి కేటీఆర్ సతీమణికి ఓటు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నందినగర్‌లో మంత్రి కేటీఆర్ నివసిస్తారు.

ఆయనకు ఇక్కడే ఓటు హక్కు ఉంది. అయితే ఆయన భార్య శైలిమకు మాత్రం ఓటు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమెకు ఓటు లేదని ఎన్నికల సిబ్బంది పేర్కొంటున్నారు. ఆమెకు ఓటు ఎందుకు లేదన్నది అంతుబట్టకుండా ఉంది. స్వగ్రామంలో కూడా ఆమెకు ఓటు లేదని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం 5 గంటలవరకు కూడా కేటీఆర్‌కు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలింగ్ స్లిప్ అందించలేదని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement