ఆ విద్యుత్‌ ఎక్కడ ఉత్పత్తి చేశారో చెప్పాలి

Where did current come from? - Sakshi
షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పడే నాటికే 6570 మెగావాట్ల విద్యుత్ ఉందని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. ఇందిరా భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు 14930 మెగావాట్లు ఉందంటున్నారు..ఎక్కడ ఉత్పత్తి చేశారో చెప్పాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి, జైపూర్, జూరాల ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్‌ పార్టీనేనని, అవే ఇప్పుడు ఉత్పత్తికి వచ్చాయని వ్యాఖ్యానించారు.

 ఈ మూడూ కలిపి 3,340 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగతా 5 వేల మెగావాట్ల విద్యుత్‌ ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి పడిపోయిందని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలపై కరెంట్ భారం పడబోతోందని వ్యాఖ్యానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top