
జాతీయ స్థాయిలో పరిష్కరించాలి: సురవరం
నదీజలాల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదీజలాల పంపిణీ, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ నదీ జలాల విషయంలో ఘర్షణ వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఆయన విమర్శించారు. భారీ వర్షాలతో పుష్కలంగా నీరు వస్తున్నందున సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.