వరంగల్ డీఈవో సస్పెన్షన్ | Warangal DEO suspension! | Sakshi
Sakshi News home page

వరంగల్ డీఈవో సస్పెన్షన్

Aug 2 2015 3:35 AM | Updated on Sep 3 2017 6:35 AM

ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత బదిలీల స్థానాలను మార్పు చేసినందుకు వరంగల్ డీఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

* రేపో మాపో మెదక్ డీఈవోపైనా వేటు!
* టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత బదిలీల స్థానాలను మార్పు చేసినందుకు వరంగల్ డీఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే మార్పులకు పాల్పడినట్లు.. భారీగా ముడుపులు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టిన విద్యా శాఖ బదిలీ అయినవారి స్థానాలను మార్చేసినట్లు తేలడంతో తదుపరి చర్యలకోసం సిఫారసు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసి జిల్లాను వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. వరంగల్ ఆర్‌జేడీని ఇన్‌చార్జి డీఈవోగా నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 135 జారీ చేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు డీఈవోలు తెరతీయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వరంగల్‌తోపాటు సీఎం కేసీఆర్ జిల్లా అయిన మెదక్‌లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాగా, వరంగల్ డీఈవోను సస్పెండ్ చేయగా, మెదక్ డీఈవో రాజేశ్వర్‌రావు నేతృత్వంలో జరిగిన బదిలీల్లో అక్రమాలపైనా పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది.

హేతుబద్దీకరణ ఉత్తర్వుల ప్రకారం ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయవద్దని నిబంధనలు ఉన్నా.. ఒక ఉర్దూ స్కూల్‌ను రేషనలైజే షన్‌లో రద్దు చేసి, అందులోని టీచర్లను హైదరాబాద్ సమీపంలోని స్కూళ్లకు పంపించిన ట్లు ఆరోపణలున్నాయి. అయా స్కూళ్లలో ఉర్దూ మీడియం లేకపోయినా కావాలనే హైదరాబాద్ సమీపానికి బదిలీ చేసినట్లు తెలుస్తోం ది. ఈ వ్యవహారంలోనూ భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.

విచారణ బృందం ఆదివారం లేదా సోమవారం నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. దీంతో ఆయనపైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబా ద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.  ఈ వ్యవహారాల్లో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత డీఈవోలపై ఎలాంటి చర్యలు చేపడతారన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement