ప్రపంచవ్యాప్తంగా ‘వనా క్రై’ వైరస్ సృష్టిస్తున్న భయోత్పాతంతో రాష్ట్రప్రభుత్వ విభాగాలు ఉలిక్కిపడ్డాయి.
స్టేట్ డేటా సెంటర్లో ముందు జాగ్రత్తలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ‘వనా క్రై’ వైరస్ సృష్టిస్తున్న భయోత్పాతంతో రాష్ట్రప్రభుత్వ విభాగాలు ఉలిక్కిపడ్డాయి. స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ)లో నిక్షిప్తమై ఉన్న డేటా ఎంత వరకు భద్రంగా ఉందోనని ఆందోళన పడ్డాయి. ప్రభుత్వ శాఖల్లోని సాంకేతిక విభాగాలు, సాంకేతిక సేవలందిస్తున్న ఐటీ కంపెనీలు భద్రతా చర్యలు చేపట్టాయి. ఎస్‌డీసీలోని డేటాను మరోచోట భద్రపరచడం తో పాటు వనా క్రై వైరస్‌ను తట్టుకునే యాంటీవైరస్‌ను అప్‌డేట్ చేసే పనిలో పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 6 వరకు లావాదేవీలు జరపొ ద్దని విభాగాధిపతులకు సూచించాయి. దీంతో ఉపాధి హామీ లావాదేవీలు, ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి దర ఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో మాన్యువల్‌గా దరఖాస్తులను స్వీకరించి నట్లు తెలిసింది. అయితే స్టేట్ డేటా సెంటర్‌ను షట్‌డౌన్ విషయాన్ని ఐటీ శాఖ అధికారులు ధ్రువీకరించలేదు.