రాంగోపాల్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ కింద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సిటీ: రాంగోపాల్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ కింద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దూల్‌పేటకు చెందిన నరేశ్ బల్కీ(20) అలియాస్ ఇమ్రాన్, కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన జి. విజయ్ కుమార్ చౌదరీ(22) అలియాస్ ఒమర్‌లు ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి మంగళసూత్రాలను దొంగతనం చేస్తూ పలుమార్లు పట్టుబడ్డారు. నరేష్‌పై 24 కేసులు, విజయ్‌పై 17 కేసులు నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఉన్నాయి. వీరిపై దొంగతనం, గూండా, మాదకద్రవ్యాల సరఫరా లాంటి పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.