'కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం' | tummala nageswara rao takes on krishna water board | Sakshi
Sakshi News home page

'కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం'

Jun 5 2016 1:29 PM | Updated on Sep 4 2017 1:45 AM

కృష్ణా వాటర్ బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

హైదరాబాద్ : కృష్ణా వాటర్ బోర్డు అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... కృష్ణా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా చట్టానికి లోబడే పని చేయాలన్నారు.

ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్పై తాము అభ్యంతరాలు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. తమ ప్రాజెక్ట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. ఇరు రాష్ట్రాలు సఖ్యంగా ఉంటేనే అభివృద్ధి అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement