తెలంగాణలో పాడి పరిశ్రమను అన్నివిధాలా ప్రోత‍్సహిస‍్తున్నామని పశుసంవర‍్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.
పాడి పరిశ్రమకు ఇతోధిక ప్రోత్సాహం: తలసాని
Jan 3 2017 12:38 PM | Updated on Aug 11 2018 6:42 PM
హైదరాబాద్: తెలంగాణలో పాడి పరిశ్రమను అన్నివిధాలా ప్రోత‍్సహిస‍్తున్నామని పశుసంవర‍్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. శాసనసభలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ ఆగస్టు నెల వరకూ పాడి రైతులకు ప్రోత్సాహకాలు చెల్లించామని, ప్రోత్సాకాల మిగతా బకాయిలను త‍్వరలో చెల్లిస్తామని చెప్పారు. విజయ డెయిరీలో 11 రకాల పాల ఉత‍్పత్తులు తయారవుతున్నాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మొబైల్ వెటర‍్నరీ వాహనం సమకూర్చుతామని పేర‍్కొన్నారు.
Advertisement
Advertisement